
మహదేవ్ ఆన్ లైన్ బుక్ బెట్టింగ్ మాఫియా తన స్థవరాన్ని మార్చింది. ఇంతకుముందు దుబాయ్ నుంచి తన యాక్టివిటీస్ నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ మాఫియా ఇకనుంచి శ్రీలంకనుంచి నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందట. ఈడీ విచారణలో ఈ మాఫియా దుబాయ్ గుట్టు మొత్తం రట్టు కావడంతో స్థావరాన్ని శ్రీలంకకు మారుస్తున్నట్లు తెలుస్తోంది.
మహదేవ్ యాప్ దుబాయ్ హెడ్ ఆఫీస్, దాని కార్యకలాపాలు, యూఏఈ లో దాని షెల్ కార్పొరేషన్లు, కాంప్లెక్స్ లతో సహా మాఫియాకు సంబంధించిన మొత్తం వివరాలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జరిపిన విచారణలో బయటికొచ్చాయి. 2023లోనే ఈడీ శ్రీలంకలో మహదేవ్ బెట్టింగ్ మాఫియా ఆనవాళ్లు గుర్తించింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాలా తీయడంతో సహా అవినీతి రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటుంది. దీంతో మహదేవ్ బెట్టింగ్ మాఫియా అక్కడ తమ కార్యకలాపాలకు మంచి సమయం అని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఏడాదిన్నర కాలంగా మహదేవ్ ప్రమోటర్లు శ్రీలంకలో చాలా చురుుకగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. చట్టబద్దమైన పెట్టుబడులు అంటూ.. అధిక మొత్తంలో పెట్టుబడులు శ్రీలంక ఎస్టేట్ మార్కెట్, ఇతర వ్యాపారాల్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా ఆస్తులను భ్రదపరచడం, వారి బెట్టింగ్ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ సంస్థల్లా నిధులు సమకూరుస్తున్నాయట. శ్రీలకంలో కొనసాగుతున్న సంక్షోభం వల్ల ఎదురయ్యే ఆర్థిక బలహీనతలు, అవకాశాలను ఉపయోగించుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు ఈడీ అంటోంది.
మహదేవ్ దేవ్ యాప్ కు అనుబంధంగా ఉన్న పాకిస్తాన్ కు చెందిన ఖేలో యార్ యాప్ , లంక ప్రీమియర్ లీగ్ 2023లో ప్రముఖ స్పాన్సర్ గా గుర్తించిన తర్వాత శ్రీలంకలో కూడా మహదేశ్ యాప్ ప్రమోటర్ల యాక్టివిటీలను ఈడీ గుర్తించింది. సౌరభ్ చంద్రకర్, డీ ముస్తాకీమ్ కస్కర్ సోదరుడు ఈ బెట్టింగ్ యాప్ కు ప్రమోటర్లుగా పనిచేస్తున్నట్లు ఈడీ గుర్తించింది.